ఏపీలో ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ ఆర్డినెన్స్ జారీ

17-04-2025 Thu 14:34 | Andhra
Advertisement
  • ఇటీవ‌లే ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్ కు కేబినెట్ ఆమోదం
  • తాజాగా గ‌వ‌ర్న‌ర్ జ‌స్టిస్ అబ్దుల్ న‌జీర్ ఆమోదంతో గెజిట్‌ను జారీ 
  • ఈ మేర‌కు న్యాయ‌శాఖ కార్య‌ద‌ర్శి ప్ర‌తిభాదేవి ఉత్త‌ర్వులు
Advertisement
రెండు రోజుల కింద‌ట ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్న విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగా సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) వర్గీకరణకు సంబంధించిన ముసాయిదా ఆర్డినెన్స్‌కు మంత్రిమండ‌లి ఆమోదం తెలిపింది. 

ఈ క్రమంలో, ఈరోజు ఏపీ ప్ర‌భుత్వం ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ ఆర్డినెన్స్ జారీ చేసింది. గ‌వ‌ర్న‌ర్ జ‌స్టిస్ అబ్దుల్ న‌జీర్ ఆమోదం అనంత‌రం ఇందుకు సంబంధించిన గెజిట్‌ను న్యాయ‌శాఖ‌ జారీ చేసింది. ఈ మేర‌కు న్యాయ‌శాఖ కార్య‌ద‌ర్శి ప్ర‌తిభాదేవి ఉత్త‌ర్వులు ఇచ్చారు. 

ఇక, ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్‌ ప్రకారం 59 ఉపకులాలను మూడు గ్రూపులుగా విభజించినట్లు మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి ఇటీవ‌ల మీడియాకు తెలిపారు. గ్రూప్-1లోని 12 ఉపకులాలకు 1 శాతం, గ్రూప్-2లోని 18 ఉపకులాలకు 6.5 శాతం, గ్రూప్-3లోని 29 ఉపకులాలకు 7.5 శాతం రిజర్వేషన్లు వర్తింపజేయనున్నట్లు ఆయన వివరించారు. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఫలాలు అన్ని ఉపకులాలకు సమానంగా అందేలా 200 పాయింట్ల రోస్టర్ విధానాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

గ్రూప్-1 (1% రిజర్వేషన్)
ఈ గ్రూపులో రెల్లి కులంతో పాటు మొత్తం 12 ఉపకులాలు ఉన్నాయి. వీటికి కలిపి 1 శాతం రిజర్వేషన్‌ను కేటాయించారు. 
ఈ గ్రూపులోని ఉపకులాలు: బవురి, చచాటి, చండాల, దండాసి, డొమ, ఘాసి, గొడగలి, మెహతర్, పాకీ, పామిడి, రెల్లి, సాప్రు.

గ్రూప్-2 (6.5% రిజర్వేషన్
మాదిగ కులంతో పాటు మొత్తం 18 ఉపకులాలను గ్రూప్-2గా వర్గీకరించారు. ఈ గ్రూపునకు 6.5 శాతం రిజర్వేషన్లు దక్కనున్నాయి. 
ఈ గ్రూపులోని ఉపకులాలు: అరుంధతీయ, బిందల, చమార్, చంభార్, దక్కల్, ధోర్, గొదారి, గోసంగి, జగ్గాలి, జంబువులు, కొలుపులవాండ్లు, మాదిగ, మాదిగ దాసు, మాంగ్, మాంగ్‌ గరోడి, మాతంగి, సమగార, సింధోలు.

గ్రూప్-3 (7.5% రిజర్వేషన్)
మాల కులంతో పాటు అత్యధికంగా 29 ఉపకులాలు ఈ గ్రూపులో ఉన్నాయి. గ్రూప్-3కి అత్యధికంగా 7.5 శాతం రిజర్వేషన్లు కేటాయించడం జరిగింది. 
ఈ గ్రూపులోని ఉపకులాలు: ఆది ద్రవిడ, అనముక్, అరయ మాల, అర్వ మాల, బారికి, బ్యాగర, చలవాది, ఎల్లమలవార్, హోలేయ, హోలేయ దాసరి, మదాసి కురువ, మహర్, మాల, మాల దాసరి, మాల దాసు, మాల హన్నాయి, మాలజంగం, మాల మస్తి, మాల సాలె, మాల సన్యాసి, మన్నే, మండల, సంబన్, యాతల, వల్లువన్, ఆది ఆంధ్ర, మస్తి, మిట్టా అయ్యలవార్, పంచమ.

Advertisement
AP GovtAndhra Pradesh SC ClassificationScheduled Castes ClassificationAP SC Reservation OrdinanceAndhra Pradesh GovernmentSC Sub-castesReservation PolicyJustice Abdul NazeerDola Balaveera AnjaneyaswamyAP Cabinet Decision200-point Roste

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more